తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్ వేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గంలో సిట్ నివేదికపై చర్చ కొనసాగింది. అన్ని అంశాలు పక్కనపెట్టి మరీ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించారు. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్ షీట్లో ఎందుకు మిస్ అయ్యాయనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

