అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు స్థానికులను వణికించాయి. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాలిఫోర్నియాలోని కాంట్రా కోస్టా కౌంటీలో ఉన్న శాన్ రామన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. శాన్ రామన్ నగరానికి సుమారు 3 మైళ్ల దూరంలో, భూ అంతర్భాగంలో 8.59 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.

