తాము చేపట్టిన భూ రీసర్వేను కూడా తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. చంద్రబాబుకు వచ్చిందల్లా భూములను నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. నాలుగుసార్లు సీఎంగా ఉండి.. ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? చంద్రబాబూ ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?” అని ప్రశ్నించారు.

