వలస కార్మికులకు గల్ఫ్ దేశమైన ఒమన్ పిడుగు లాంటి వార్త చెప్పింది. కీలక కార్మిక సంస్కరణ (Labour reform) తీసుకొచ్చింది. ఇది 200 కంటే ఎక్కువ వృత్తులలో ప్రవాసులు పనిచేయకుండా నిషేధిస్తుంది. ప్రభుత్వం అన్ని రెస్ట్రిక్టెడ్ రోల్స్ డీటైల్డ్ లిస్టుని రిలీజ్ చేయలేదు. అయితే ఈ నిషేధం హాస్పిటాలిటీ; అడ్మినిస్ట్రేటివ్, క్లెరికల్ సర్వీసెస్ రంగాలు,సూపర్వైజరీ రోల్స్, కొన్ని మేనేజ్మెంట్ పొజిషన్స్కి వర్తిస్తుందని అధికారులు ధృవీకరించారు. ఇవి భారతీయుల సహా ప్రవాసులు ఎక్కువగా పని చేసే రంగాలు కావడం గమనార్హం.

