ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం చెప్పారు కవిత. సోమవారం నాడు శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తరువాత గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు కవిత. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుందని కవిత ప్రకటించారు. రాజకీయంగా అందరూ మద్దతు ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటకు వస్తున్నానని.. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు.

