ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించింది. సుమారు ఏడు గంటలు నవీన్ రావును విచారించిన అధికారులు స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారు. ప్రత్యేక డివైజ్ లు ఉపయోగించి అప్పటి ప్రతి పక్ష నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారని, ప్రయివేట్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు, వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారనేదానిపై సిట్ కూపీ లాగింది.

