కర్నూలు జిల్లాలోని పెద్ద హరివాణం కొత్త మండలంగా ప్రకటించి పెద్ద హరివాణం మండలంలోకి 22 ఊర్లను కూడా కేటాయించింది. అయితే మెజారిటీ గ్రామాల ప్రజల పెద్ద హరివాణం మండల ఏర్పాటును అంగీకరించలేదు. 16 గ్రామాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసన దీక్షలు చేపట్టారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆదోని మండలాన్ని, ఆదోని -1, ఆదోని -2గా విభజించింది. తాజాగా పెద్ద హరివాణం మండల కేంద్రం చేసేవరకూ ఏ రాజకీయ నాయకుడిని కూడా ఊర్లోకి రానివ్వకూడదని నిర్ణయించారు.ఆ మేరకు ఊరి బయట బోర్డును పాతారు.

