కోట వినుత డ్రైవర్ రాయుడు హత్యకేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వినుత భర్త చంద్రబాబు విడుదల చేసిన వీడియో ప్రకంపనలు రేపుతోంది. ముందస్తు ప్రణాళికతోనే రాయుడు హత్య జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయుడు హత్య విషయం చెన్నై పోలీసుల కంటే ముందే.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎలా తెలిసిందని, రాయుడు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలో ఉన్న సమాచారం కొంతేనని.. తమ దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని వినుత భర్త చంద్రబాబు తెలిపారు

