అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. తాజాగా అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటికీ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని ఛైర్పర్సన్గా నియమించింది. అసోం, బంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి కోసం కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో కమిటీలో నలుగురు సభ్యులు చొప్పున ఉంటారని పేర్కొన్నారు. అందులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అయిన ప్రియాంక గాంధీని అసోం కమిటీకి ఛైర్పర్సన్గా నియమించినట్లు పేర్కొన్నారు.

