రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తామే నిలిపివేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.ఈ వ్యాఖ్యలను పూర్తిగా అసంబద్ధమైనవిగా అభివర్ణించింది. చంద్రబాబు నాయుడు పేరును కేంద్రంగా చేసుకుని తెలంగాణలో అధికార, విపక్ష పార్టీలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ప్రజా ప్రయోజనాలకన్నా రాజకీయ లబ్ధికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించింది.

