పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రూ.100 కోట్ల స్కాంకు పాల్పడిందని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో వరద బాధితులకు అందించాల్సిన సాయంలో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ లో స్కాంకు సంబంధించి పలు వివరాల్ని బీజేపీ వెల్లడించింది. కోల్ కతా హైకోర్టుకు కాగ్ సమర్పించిన 700 పేజీల నివేదిక ఆధారంగా బీజేపీ ఈ ఆరోపణలు చేసింది.

