వెనిజులా రాజధాని కారకస్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. శనివారం ఉదయం నుంచి ఏడు చోట్ల ఈ బాంబు పేలుడు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడులు చేస్తున్నామని సైన్యం కూడా ధ్రువీకరించింది. ప్రధానంగా ఈ దాడులు తమ పౌరులు, సైనిక స్థావరాలపై దాడి చేస్తుందని వెనిజులా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రధానంగా కరాకాస్తో పాటు మిరండా, అరగువ, లా కార్లోటా ప్రాంతాల్లో బాంబుల వర్షాలు కురిశాయి. వెనుజుల అధ్యక్షుడు నికోలస్ జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు.

