గరికపాటి నరసింహారావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు యూట్యూబర్ అన్వేష్. అయితే అన్వేష్ వ్యాఖ్యలకు మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేరస్థుడికి పది సంవత్సరాలు శిక్ష వేసినా మారుతాడో లేదో కానీ సమాజం ఛీ కొడితే మాత్రం మార్పు వస్తుంది అంటూ గరికపాటి నరసింహారావు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అలా చేస్తే పదిరోజుల్లోనే మరుతాడని చెప్పుకొచ్చారు. ఎలాంటి మచ్చలేని వాళ్లపై ఇక్కడ బురద చల్లుతున్నారంటూ గరికపాటి నరసింహారావు మండిపడ్డారు.

