గిగ్‌వర్కర్లు డిసెంబర్ 31బుధవారం సమ్మెకు పిలుపునిచ్చారు. దీనివల్ల దేశ వ్యాప్తంగా డెలివరీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు చెందిన గిగ్‌వర్కర్లు 10 నిమిషాల డెలివరీ మోడల్ తమకు సురక్షితం కాదని, దాన్నిరద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ కంపెనీలను కార్మిక చట్టాల పరిధి లోకి తీసుకు రావాలని, ప్రమాదకరమైన 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను పూర్తిగా నిషేధించాలని, మెరుగైన వేతనాలు , సామాజిక భద్రత, ఉండాలని వీరు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

