ెలంగాణ టెట్ (TET) – 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. అయితే పరీక్ష రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1, 2లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

