ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఇక ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత జనాల ముందుకు వస్తుండటంతో అభిమానులు భారీగా హాజరయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. గుబురు గడ్డం, పిలక జుట్టుతో సరికొత్త లుక్ లో అదరగొట్టాడు డార్లింగ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ తన తర్వాతి సినిమా స్పిరిట్ కోసమే ఇలా పిలక జుట్టును పెంచుకుంటున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

