రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం.. తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణంలోని జాతర గ్రౌండ్ ప్రాంతంలో ఒక్క పిచ్చికుక్క వరుసగా దాడులు చేయడంతో 21 మంది భక్తులు కుక్కకాటుకు గురైనట్లు బాధితులు తెలిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో రాజన్న క్షేత్రంలో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రేబిస్ టీకా అందుబాటులో లేకపోవడంతో వైద్యులు వారిని సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

