హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై నటుడు శివాజీ, యాంకర్ అనసూయ మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై స్పందించిన నాగబాబు శివాజీపై ఫైరయ్యారు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం అనసూయకు సపోర్ట్‌గా నిలిచారు. ‘సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి. అది వారి నీచమైన మనస్తత్వం. మీరు ఇంకా బలంగా నిలబడండి. మేము మీతో ఉన్నాం.’ అంటూ ట్వీట్ చేశారు.

