పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ.. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ప్రైవేటీకరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచి.. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను దక్కించుకుంది. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ 13,500 కోట్ల పాకిస్థానీ రూపాయలకు (సుమారు రూ. 4,320 కోట్లు) బిడ్‌ను దక్కించుకుంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది.

