బృహత్ హైదరాబాద్ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. అలాగే, జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, 30 సర్కిళ్లను 60కి పెంచుతున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డివిజన్ల డీలిమిటేషన్‌కు 10 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6వేలకు పైగా అభ్యంతరాలు రాగా.. సహేతుకమైన వాటిని పరిగిణనలోకి తీసుకొని తుది నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలిపారు అధికారులు.

