టర్కీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. లిబియా సైనికాధికారి ముహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్ సహా ఐదుగురు మరణించినట్లు నిర్ధారించారు. మంగళవారం రాత్రి 8:30 గంటలకు అంకారాలోని ఎసెన్బోగా విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిందని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. దాదాపు 40 నిమిషాల తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత కొద్దిసేపటికే కూలిపోయినట్లు సమాచారం. ఫాల్కన్-50-క్లాస్ ప్రైవేట్ జెట్ శిథిలాలను అంకారా సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

