వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మెరుపు అర్ధ శతకంతో టీమిండియా విజయంలో కీలకమైన షఫాలీ వర్మ(69 నాటౌట్) టీ20 సిరీస్‌లోనూ దంచేసింది. వైజాగ్ మైదానంలో మంగళవారం శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తిస్తూ హాఫ్ సెంచరీతో చెలరేగింది. తనదైన స్టయిల్లో విధ్వంసం సృష్టించిన లేడీ సెహ్వాగ్ జట్టుకు భారీ విజయాన్ని అందించింది. స్వల్ప ఛేదనలో షఫాలీ మెరుపులతో ఏడు వికెట్ల తేడాతో లంకను టీమిండియా మట్టికరిపించింది. వరుసగా రెండో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

