నటుడు శివాజీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎట్టకేలకు శివాజీ దిగొచ్చాడు. మహిళలకు క్షమాపణలు చెప్పాడు. నేను మాట్లాడింది అందరు అమ్మాయి గురించి కాదు, హీరోయిన్ బయటికి వెళ్లినప్పుడు దుస్తులు బాగుంటే మంచిదనే ఉద్దేశ్యం. ఏదేమైనా రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. స్త్రీ అంటే మహాశక్టి. ఒక అమ్మావారిలా అనుకుంటాను. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, మహిళలు ఎవరైతే తప్పుగా భావిస్తే, మీ అందరికి క్షమాపణలు చెబుతున్నాను` అని తెలిపారు శివాజీ.

