గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘనవిజయం సాధించింది.50 సీట్లలో 30 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు 5 సీట్లు గెలుచుకున్నారు. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎండీపీ) రెండు స్థానాల్లో గెలుపొందగా, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), రివల్యూషనరీ గోన్స్ పార్టీ (ఆర్జీపీ) ఒక్కో సీటు చెప్పున గెలుచుకున్నాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంజీపీతో, జీఎఫ్పీ పొత్తుతో కాంగ్రెస్ పోటీ చేసింది.

