జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. అమరావతి వేదికగా “పదవి-బాధ్యత” పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవి చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదని, మనం నిర్వహించే బాధ్యత మాత్రమే గొప్పదని స్పష్టం చేశారు. జనసేనను కేవలం ఎన్నికల కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీగా చూడవద్దని పవన్ సూచించారు. దేశ సేవ కోసమే దీనిని స్థాపించినట్లు వెల్లడించారు.

