ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీని పర్మినెంట్‌గా అధికారానికి దూరం చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ శత్రువులు కాదన్న పవన్ కళ్యాణ్.. విధానాలతోనే తనకు సమస్య అని అన్నారు. ఆకు రౌడీలను ప్రోత్సహించే పార్టీని గుర్తించనన్న పవన్ కళ్యాణ్.. విధానాలపై ప్రశ్నిస్తే ప్రోత్సహిస్తానన్నారు. అలాగే అరాచకాలు మితిమీరి ఇక తప్పదని అనుకుంటే ఆఖరి అస్త్రంగా షర్ట్ మడతపెడతామంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆ పార్టీ ఓ రౌడీ సమూహంలా కనిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.

