టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్టులోని ఉప్రగ్రహాల్లో ఒకటి ఇటీవల కక్ష్య నుంచి అదుపుతప్పి భూమిదిశగా దూసుకొస్తోంది. డిసెంబరు 17న 35956 అనే శాటిలైట్ భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. కానీ, హఠాత్తుగా అది అక్కడి నుంచి కూలిపోవడం ప్రారంభించింది.. ఈ ఉపగ్రహంపై స్పేస్ఎక్స్ నియంత్రణ కోల్పోయింది. దీనివల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) లేదా భూమికి ఎటువంటి ప్రమాదం లేదని స్పేస్ఎక్స్ వెల్లడించింది.

