ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అమరజీవి జలధార’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించిందని తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం… ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములుని
సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో “అమరజీవి జలధార”గా నామకరణం చేశాం’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

