ఎన్నికల ప్రక్రియలో చొరబాటుదారులను దూరంగా ఉంచేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎన్నికల కమిషన్ చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అయితే చొరబాటుదారులను కాపాడేందుకు కొందరు ద్రోహులు ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. చొరబాట్లను నిలిపివేసేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అసోంలోని గువాహటిలో శనివారంనాడు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, అసోం, ఈశాన్య రాష్ట్రాలకు దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని చెప్పారు.

