సంప్రదాయ వైద్యం ఆధునిక జగతి ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సాయపడగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. సైన్స్, సంప్రదాయ వైద్యం ఒకదాన్ని మరొకటి పరిపూర్ణం చేస్తాయని భారత్ ప్రపంచానికి చాటిందని వెల్లడించారు. దిల్లీలో సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో టెడ్రోస్ అథనామ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

