సిరియాలోని ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ స్థాయిలో ప్రతీకార దాడులు నిర్వహించింది. ఇటీవల జరిగిన దాడులకు ప్రతిగా ఈ సైనిక చర్య చేపట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. విమాన దాడులు, క్షిపణి దాడుల ద్వారా ఐసిస్‌కు చెందిన శిబిరాలు, ఆయుధ గిడ్డంగులు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఐసిస్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి.

