రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండన్నారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నడని.. తన కుర్చీ త్వరలోనే ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి ఇవాళ్టి ప్రెస్‌మీట్‌లో అడ్డగోలుగా వాగిండని.. నాకు, కేటీఆర్‌కు మధ్యమిత్ర బేధం సృష్టించాలని.. తద్వారా బీఆర్ఎస్‌ను బలహీన పరచాలని రేవంత్ రెడ్డి చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డీ నీ చీప్ ట్రిక్కులకు ఎవడూ పడిపోడని..నీ కుట్రలుఫలించవన్నారు.

