ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ట్రిబ్యునల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించడంలో స్పీకర్ విఫలమయ్యాడని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేపీ వివేకానంద అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బాహాటంగానే కాంగ్రెస్లో ఉన్నారని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేశారని చెప్పారు.

