కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజును ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఢీకొట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, తనను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మరి దాడి చేశాడు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంటి ముందు కూర్చున్న బిఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఢీకొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

