తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 1928కు పైగా సర్పంచి స్థానాల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. భారత రాష్ట్ర సమితి మద్దతుదారులు 1027, బీజేపీ మద్దతుదారులు 219 స్థానాల్లో గెలుపొందారు. 552 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.86 శాతం పోలింగ్ నమోదైంది

