దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఎదురైన భారీ సంక్షోభం నేపథ్యంలో, విమాన భద్రత నియంత్రణ సంస్థ డీజీసీఏ కఠినంగా స్పందించింది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను గురువారం తన కార్యాలయానికి రావాలని ఆదేశించింది. డీజీసీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఎల్బర్స్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు డీజీసీఏ కార్యాలయానికి రానున్నారు. ఆయనతో పాటు విమాన సంస్థలోని సంబంధిత విభాగాల సీనియర్ అధికారులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేేశాలు జారీ చేసింది డీజీసీఏం.

