తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’లో సినీనటులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. స్క్రిప్ట్‌తో వచ్చి సినిమాలు పూర్తి చేసుకొని వెళ్లండి అని వారికి సూచించారు. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులను మర్యాదపూర్వకంగా కలిశారు.

