ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) 2.0లో భాగంగా పనిచేస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ), ఇతర అధికారులు, బంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో బెదిరింపులకు గురవుతుండడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. “ఎస్ఐఆర్కు సహకరించకపోవడం, బీఎల్ఓల పనికి ఆటంకాలు కలిగించడం, బెదిరించడం లాంటి ఘటనలను మా దృష్టికి తీసుకురండి. మేము వారికి తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం” అని ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదికి ధర్మాసనం చెప్పింది.

