ేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు , పుదుచ్చేరి వేర్వేరు అని, తాము మాత్రం అందరం కలిసే ఉన్నామని నటుడు, టీవీకే చీఫ్ విజయ్ అన్నారు. పుదుచ్చేరిలోని ఉప్పాలం లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర పాలనకు సంబంధించిన విషయాలను పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలని సూచించారు. కానీ ఆయన (స్టాలిన్) ఎప్పటికీ నేర్చుకోరని విజయ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

