చిలకలూరిపేట బైపాస్‌లో ఈనెల 4న హైవేపై కంటైనర్‌ను ఆపి ఐదుగురు బీటెక్ విద్యార్థుల మృతికి కారణమైన భారీ కంటైనర్‌ను ఆపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో పని చేసే ఏఎస్సై కుమారుడే అని గుర్తించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్గా అవతారం ఎత్తి జాతీయ రహదారులు, బైపాస్ల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గంజాయి సరఫరా, విక్రయాలు చేస్తూ కాలేజీ విద్యార్థులను మత్తులోకి దింపుతున్న కుమారుడి నేరాలకు కొన్నేళ్లుగా నరసరావుపేటలోనే పోస్టింగ్ వేయించుకుంటూ తండ్రి సహకరిస్తున్నట్లు పోలీసుశాఖలోనే చర్చ నడుస్తోంది.

