జపాన్ తీరంలో తీవ్ర భూకపం తలెత్తింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై దాదాపు 7.2గా నమోదైంది. సముద్రం అలలు 10 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర జపాన్ అంతటా సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. జపాన్ తూర్పు తీరంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా హొక్కైడో, అమోరి, ఇవాటే ప్రిఫెక్చర్ల పసిఫిక్ దీవులకు ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

