భారత్, రష్యా స్నేహసంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్. అనేక విషయాలపై మోదీ, తాను చర్చించామని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించామని తెలిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని, ఇరుదేశాల ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. చమురు, సహజవాయువు, బొగ్గు సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నామని, వైద్య, వ్యవసాయ రంగాల్లో కలిసి ముందుకెళ్తామని వివరించారు. భారత్లోని అణువిద్యుత్ ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.