పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలు రద్దుచేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. తొమ్మిదేళ్లుగా సర్వీసులో ఉన్న వారిని ఇప్పుడు తొలగిస్తే వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. సింగిల్ బెంచ్ రద్దు చేసిన ఆ 32 వేల మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని పేర్కొంది.

