రష్యా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పౌర అణు ఇంధన విభాగంలో భారత్‌తో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి ఉద్దేశించిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకునే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. డిసెంబరు 4, 5 తేదీల్లో భారత్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటించనున్న తరుణంలో రష్యా క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమిళనాడులో కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు చెందిన రియాక్టర్లను నిర్మిస్తున్న రష్యా సంస్థ రొసాతోమ్ న్యూక్లియర్ కార్పొరేషన్, రష్యా ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో భారత్‌తో ఎంఓయూ కుదుర్చుకుంటుందని ప్రకటించారు.

