మహారాష్ట్ర బీజేపీ మంత్రి పంకజ ముండే పీఏ అనంత్ గార్జే భార్యడాక్టర్ గౌరీ పాల్వే ఆత్మహత్య కేసు సంచలనం రేపుతోంది. గౌరీ ఆత్మహత్యకు ప్రధాన కారణం అనంత్ గార్జే వివాహేతర సంబంధాలే అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది తిరగక ముందే విడిపోవడం విషాదకరం. వివాహం తర్వాత కూడా అనంత్‌కు వివాహేతర సంబంధాలు గౌరికి తెలియడంతో వారిద్దరి మధ్య వాదనలు జరిగేవని,గౌరీని హత్య చేశారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది.

