సౌదీ అరేబియాలో భారతీయ ఉమ్రా యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంలో హైదరాబాద్కు చెందినవారు ఎక్కువగా ఉన్నారనీ, మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నారని సమాచారం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. తెలంగాణకు చెందిన బాధితుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనీ, కేంద్ర విదేశాంగ శాఖ (MEA), సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు.

