స్టార్ యాక్టర్ అల్లు అర్జున్, అట్లీ మూవీ షూటింగ్లో బిజీగా ఉండే అల్లు అర్జున్ కాస్త రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్లిపోయాడు. షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్న అల్లు అర్జున్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోమశిలలో సందడి చేశాడు. కృష్ణానదిలో ఫ్యామిలీతో కలిసి బోటులో షికారు చేశాడు. నల్లమల అందాలను వీక్షించి సరికొత్త అనుభూతి పొందారు. అల్లు అర్జున్ సరదా వెకేషన్ ట్రిప్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

