భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఇటీవల నట జీవితంలో 50 ఏళ్ల ఘన ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా 56వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం ముగింపు వేడుకలో రజనీకాంత్‌ను సన్మానించనున్నారు. ఈ సన్మానం ఐఎఫ్ఎఫ్ఐకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా.. గోవా వేదికగా నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ వేడుక జరుగనుంది.

