కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఈ ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న సిట్, ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం అరెస్ట్ చేశారు. ఇటీవల కస్టడీలో ఏ1 జనార్ధన్ నుంచి కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు అరెస్ట్‌కు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. అటు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపించారు. దీంతో జోగి రమేష్ ఇంటి వద్దకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు

