రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ్గళ్ళపల్లి మండలం బస్వాపూర్ చెందిన సతీష్ అనే యువకుడు మస్కట్లో పీకల్లోతు సమస్యల్లో చిక్కుకున్నాడు. తినడానికి సరైన ఆహారంలేక, రోజులు గడవడం కూడా కష్టంగా మారింది. తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోవాలా..? అని ఆవేదనతో కన్నీరు పెట్టుకున్న సతీష్ చివరకు తన బాధను సెల్ఫీ వీడియో రూపంలో బయటపెట్టాడు. ఈ వీడియోలో సతీష్ తన గోడునంత వెల్లగక్కాడు. నన్ను భారత్కు తీసుకెళ్లండి. ‘మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్లాలనుంది‘ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

